Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5వ తేదీ నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
రైతులు పండించిన ధాన్యాన్ని ఈసారి కూడా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 5వ తేదీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న కేంద్రాలు యథావిధిగా ఉంటాయన్నారు. సొసైటీలతో పాటుగా ఐకేపీల ద్వారా డీఆర్డీఏ ద్వారా ఏవైతే కేంద్రాలు ఉన్నాయో అవన్నీ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో సొసైటీ అధ్యక్షులు, సీఈవోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కసరత్తును సిద్ధం చేసుకోవాలన్నారు. పెరిగిన డీజిల్ ధరల నేపధ్యంలో ట్రాన్స్పోర్ట్ రంగంపై ప్రభావం పడనుందని, ఇందుకు సంబంధించి పౌరసరఫరాలశాఖ కమిషనర్‌తో మాట్లాడటం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర తదితర అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష జరిపి రైతులకు ధాన్యం పండించిన రైతులకు భరోసా కలిగించాలని కలెక్టర్‌ను కోరడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రానప్పటికి రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. ధాన్యం పండిస్తున్న రైతులు ఆందోళన చెంది ఎక్కడి ధాన్యాన్ని అక్కడే అమ్ముకుని నష్టపోవద్దని ఎమ్మెల్యే రైతులను కోరారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లయీస్ ద్వారా రూ.30వేల కోట్లు అప్పు ఇచ్చి ధాన్యాన్ని కొనడం జరుగుతోందని ఎమ్మెల్యే సండ్ర స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర కృతజ్ఞతలు తెలిపారు. 5వ తేదీన సత్తుపల్లిలోని అయ్యగారిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, నాయకులు దొడ్డా శంకరరావు, కైన్సిలర్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మల్లూరు అంకమరాజు పాల్గొన్నారు.