Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, ఎస్సి కార్పొరేషన్ పెండింగులో ఉన్న రుణాలను తక్షణమే విడుదల చేయాలని, ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని, డబల్ బెడ్ రూమ్స్, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కెవిపిఎస్ ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం తహశీల్దార్ కార్యాలయం ముందు దళిత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దళితులు ధర్నా నిర్వహించారు. అనంతరం నగర నాయకులు మాగి భద్రయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల కు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గడిచిన ఏడేళ్లలో అనునిత్యం దళితులను మోసగిస్తుండటంతో ప్రజలు విసుగు చెందుతున్నారని, నిన్న బయటపడిన ఉప ఎన్నికల ఫలితాల్లో అదీ రుజువు అయ్యిందని వారు స్పష్టం చేశారు. దళిత బంధు ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారంకై భవిష్యత్తు కార్యాచరణను రూపొంచు కొనుటకై ఈ నెల 10 వ తేదీన ఖమ్మంలో రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ధర్నానంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయ సూపరిండెంట్ సురేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, జిల్లా నాయకులు ఎస్.కె. సైదులు, కుక్కల సైదులు, ఖమ్మం నగర రెండవ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు నకరికంటి చిరంజీవి, బొట్ల సాగర్, నగర నాయకులు పోతురాజు జార్జి, మండల వీరస్వామి, జగదీష్, దాసరి వాసు, స్వామి తదితరులు పాల్గొన్నారు.