Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం, వేపలగడ్డ, అంజనాపురం, సారపాక, తాళ్లగొమ్మురు గ్రామ పంచాయతీలకు చెందిన పది మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుండి మంజూరైన చెక్కులను బుధవారం జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అందజేశారు. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు వారివారి నివాసాలకు వెళ్లి చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షరాలు లలిత, టిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి నల్లమోతు సురేష్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, సారపాక టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీను, టిఆర్ఎస్ మైనార్టీ మండల అధ్యక్షులు గుల్ మహమ్మద్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు చెన్నం రవి, మొండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, వారాల వేణు, సారపాక టిఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.