Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-భద్రాచలం
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 3వ వార్డులో గ్యాస్ బండలు పెట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ అధ్యక్షురాలు డి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా టౌన్ కార్యదర్శి మర్లపాటి రేణుక మాట్లాడుతూ రోజురోజుకు మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతుందని విమర్శించారు. ఈ సారి దీపావళికి మహిళలకు గొప్ప కానుక గ్యాస్ ధరల పెంపు ఇలా రోజురోజుకీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ , నిత్యావసర వస్తువులు పెంచుకుంటూ పోతుందని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎన్.లీలావతి, యు.జ్యోతి, ఎస్.గంగ, జీ.జీవన జ్యోతి, సిహెచ్. ధనలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.