Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండలంలో గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వవర్తించి బదిలీపై వెళ్తున్న సీఐ సట్ల రాజును బుధవారం కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తొలుత ఆయనకు పుష్ప గుచ్చాలను అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఐగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవాలందించారన్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో చాక చక్యంగా వ్యవహరిస్తూ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా విశిష్ట సేవలందించి తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి కల్పన కోసం కుట్టు మెషిన్ లాంటి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి వారికి చేయూతనిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయుకులు ఇసంపల్లి కృష్ణ,హెవీ వాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాణోత్ సీతారాములు, ముస్లిం మైనారిటీ జిల్లా నాయుకులు సయ్యద్ యాకుబ్ పాషా,షేక్ నయీమ్, మాల మహానాడు నాయుకులు కాలవ సంసోన్,మేకల భాస్కర్, టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి గద్దల రామకృష్ణ పాల్గొన్నారు.