Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పోడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించిందని ఎంఎల్ఏ హరిప్రియ అన్నారు. స్ద్థానిక మార్కెట్ యార్డులో బుధవారం పోడు అడవుల పరిరక్షణపై భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల అధికారులైన తహశీల్దార్లు, రేజంర్లు, పోలీసు, ఎండిఓలు, జెడ్పిటీసి, ఎంపిటీసి, మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఎల్ఏ హరిప్రియ అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో 2.80లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయన్నారు. ఇందులో 80వేల ఎకరాల పోడు గుండాల, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లోనే ఉన్నాయన్నారు. 2005 తరువాత 15 వేల ఎకరాలు పోడు చేశారని అన్నారు. ఇల్లందులో 22,515, టేకులపల్లిలో 26,530, గార్లలో 714, కామేపల్లిలో 988, బయ్యారంలో 22,360 ఎకరాల పోడు ఉందన్నారు. పోడు దరఖాస్తులు ప్రభుత్వం ఇస్తుందని దీని ప్రకారమే దరఖాస్తులు ఈనెల 8 నుండి స్వీకరిస్తారని తెలిపారు. 2005 చట్టానికి లోబడి మాత్రమే దరఖాస్తులు పరిశీలిస్తారని తెలిపారు. 2005 తరువాత పోడు దరఖాస్తుల పరిశీలన ప్రసక్తేలేదన్నారు. కేంద్ర పరిధిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదన్నారు. ఎంపిటీసిలు, సర్పంచ్లదే ప్రధాన బాధ్యత అన్నారు.
మూడు తరాల సాక్ష్యాధారాలు చూపించాల్సి ఉంటుంద న్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోడు ఉంటే అనర్హలని అన్నారు. ఒకరికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. గ్రామ స్థాయిలో ఎఫ్ఆర్సి కమిటీలు 10 నుండి 15 మంది సభ్యులతో ఎంపిక చేయాలన్నారు. ఈ కమిటీల్లో ఎంపిటీసిలు, సర్పంచ్లు ఉండవద్దన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చూస్తారని అన్నారు. అనంతరం ఎఫ్డిఓ నీరజ్ కుమార్, డిఎస్పి రవీందర్ రెడ్డి, అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్ మున్సిపాలిటీ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరు,్ల గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్లు మాట్లాడారు. ఈ సమావేశంలో నియోజరవ్గరంలోని ఇల్లందు, గార్ల, బయ్యారం, కామేపల్లి, టేకులపల్లి తహశీల్దార్లు, ఎండిఓలు, ఈఓఆర్డిఓలు, కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు ఫారెస్ట్ రేంజర్ పోలీస్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పోడు సమస్య పరిష్కారం పకడ్బంధీగా చేయాలని ఎన్డీ వినతి
గిరిజనుల పోడు సమస్యలు పకడ్బంధీగా పరిష్కరింపజేయాలని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో ఎంఎల్ఏ హరిప్రియ, ఎఫ్డిఓ అధికారి నీరజ్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. పోడు సాగుదారులు సాగుచేసుకుంటున్న భూములకు 2014 జూన్2 ను కటాఫ్ తేదీ గా నిర్ణయించి పట్టాలివ్వాలన్నారు. పోడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. పోడు భూముల పట్టాలిస్తామని సర్వేల పేరుతో అమాయక గిరిజన ప్రజల దగ్గర అటవీశాఖ అధికారులు లంచాలను తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రజిత(మర్రిగూడెం), సరోజిని (పొలారం), సంతు (ఎల్లన్న నగర్), కష్ణ వేణి (కోమరారం), శ్రీను(పోచారం), మోకాళ్ళ కష్ణ(మాణిక్యారం), ఎంపిటీసి ఈసాల పాపమ్మ, న్యూడెమోక్రసీ డివిజన్ సహాయ కార్యదర్శి తుపాకుల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.