Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని
నవతెలంగాణ-అశ్వారావుపేట
దళితులకు ఇస్తానన్న మూడెకరాలు, గిరినులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా వారి సాగులో ఉన్న భూములను ప్రాజెక్టులు పేరుతో, కార్పోరేట్లకు దారాదత్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట రాబందులా వ్యవహరిస్తున్నారని సిపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సీపీిఐ(ఎం) అశ్వారావుపేట 8వ మండల మహాసభ బుధవారం వినాయకపురంలోని (ఉమా చంద్ర ఫంక్షన్ హాల్) లో మడకం భద్రం ప్రాంగణం, నార్లపాటి సత్యం నగర్ లో నిర్వహించారు. మహాసభలకు మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మడకం గోవిందు,తగరం నిర్మల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. కరోనా నియంత్రణలో మోడీ నేతృత్వ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అందుకే రోగులు, మృతులు సంఖ్యను తప్పుగా చూపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేసారు. అధికారిక లెక్కలు ప్రకారం ప్రపంచంలో 50 కోట్లు మంది కరోనాతో మృతి చెందితే భారత దేశంలో 50 లక్షలు మంది మృత్యువాత పడ్డారని కానీ కేంద్రప్రభుత్వం ఆ లెక్కలను తప్పుగా చూపిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రైతు బంధు పేరుతో కేసీఆర్ భూస్వాములకు,ధనవంతులకు బంధువు అయ్యారని, ప్రజాధనాన్ని ఈ పథకం పేరుతో పెద్దలకు దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఈ సభలకు ముందుగా సీనియర్ నాయకులు, నందిపాడు సర్పంచ్ ఊకే వీరాస్వామి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి రవికుమార్, కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, ఖమ్మం జిల్లా నాయకులు మోరంపుడి పాండురంగారావు, నాయకులు మోరంపుడి శ్రీనివాసరావు,దొడ్డా లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) అశ్వారావుపేట కన్వీనర్ గా చిరంజీవి
సిపిఐ(ఎం) అశ్వారావుపేట మండల కన్వీనర్ గా సీనియర్ నాయకులు బి.చిరంజీవి ఎంపికయ్యారు. సభ్యులుగా పిట్టల అర్జున్, ముల్లగిరి గంగరాజు, గడ్డం సత్యనారాయణ, మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం నిర్మలతో పాటు మరో 17 మందితో కన్వీనింగ్ కమిటీ ఎంపిక అయింది. ఈ కార్యక్రమానికి పార్టీ దమ్మపేట, సత్తుపల్లి సీనియర్ నాయకులు మోరంపుడి శ్రీనివాసరావు, దొడ్డా లక్ష్మినారాయణ, మోరంపుడి పాండు రంగారావులు హాజరయ్యారు.a