Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీవీసీఎం మావోయిస్టు మృతి
అ ధృవీకరించిన దంతేవాడ ఎస్పీ
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు చత్తీస్ఘడ్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సంఘటన వివరాలు ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించి వివరించారు. దంతేవాడ పోలీసులకు యాంటీ నక్సల్ ఆపరేషన్లో మరో విజయం లభించింది. గుమల్నార్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో రివార్డ్ పొందిన మావోయిస్టును పోలీసులు హతమార్చారు. ఈ ఎన్కౌంటర్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది. పక్కా ఇన్ఫార్మర్ సమాచారం మేరకు పోలీసులు డీఆర్జీ బృందాన్ని గుమల్నార్ వైపు తీసుకెళ్లారు. పోలీసు బృందం ఇక్కడి అడవుల్లోకి చేరుకోగానే మావోయిస్టుల వైపు నుండి మెరుపుదాడిన సైనికులపై కాల్పులు జరిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఆత్మరక్షణ కోసం సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ తర్వాత, జవాన్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, వారు సంఘటనా స్థలం నుండి మావోయిస్టు మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడు డివిసిఎం రాంసుగా గుర్తించారు. మృతదేహం దగ్గర నుంచి పిస్టల్, ఐఈడి మందుపాతర వైర్ తదితర వస్తువులను సైనికులు స్వాధీనం చేసుకున్నారని ఆయన విపులీకరించారు.