Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
మీ-సేవ వ్యవస్థ ప్రారంబి óంచబడి శుక్రవారం నాటికి పది సంవత్సరాలు అవుతున్న తరుణ ంలో కలెక్టర్ అనుదీప్ మీ-సేవా కేంద్రాల వినియోగ దారులు, తహసీల్దార ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ-సేవ అనేది ప్రజల యొక్క అనేక అవసరాల నిమిత్తం వినియోగించుకొని సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచి అప్లరు చేసుకొనే అన్లైన్ విధానమని, ఈ విధానం ద్వారా ఎకౌంటుబిలిటి, పారదర్శకత ఉంటుందని చెప్పారు. జిల్లాలో 109 మీ-సేవ సెంటర్లు ఉన్నాయని, ఇట్టి మీ సేవ సెంటర్ల ద్వారా ఒక రోజుకి వేల సంఖ్యలో ప్రజా సంబంధిత అవసరాల కోసం లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. మీ సేవ సెంటర్ల ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు స్వశక్తితో నిలబడి ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వం సంకల్పం మేరకు పని చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన పథకాలైన ధరణి, ఆసరా పెన్షన్, పన్నులు వసూలు, సర్టిఫికెట్లు వంటి అనేక రకాల సర్వీసులు చేస్తున్నట్లుగా భవిష్యత్తులో రాబోవు సర్వీసులు కూడా అదే రకమైన కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ అశోక చక్రవర్తి, ఏఓ గన్య నాయక్ మండల తహసీల్దార్లు, ఈడి ఎం.విజయ సారథి, డిఎం శివ కృష్ణ పాల్గొన్నారు.