Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ. 5కోట్లు సీడీఎఫ్ నిధులు
అ రూ. 30కోట్లు కేటీఆర్ నిధులు
అ రూ. 20కోట్లు డీఎంఎఫ్ నిధులు
అ విలేకర్లతో సత్తుపల్లి ఎమ్మెల్యే
సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ అభివృద్ధితో పాటు నియోజక వర్గంలోని పలు గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల ను ఖర్చు చేయడం జరుగుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం ఆపార్టీ సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు గృహంలో ఎమ్మెల్యే సండ్ర విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 5కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధుల్లో రూ. 3 కోట్లు గ్రామాల అభివృద్ధికి కేటాయించడం జరిగిందన్నారు. మిగతా రూ. 2కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు కోసం కేటాయించామన్నారు. వీటితో పాటు సింగరేణి ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) ద్వారా మరో రూ. 20కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటితో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనాల నిర్మాణం, పెద్దాసుపత్రికి నూతన భవనాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఒక్క అక్టోబరు నెలలోనే 266 మంది లబ్ధిదారులకు రూ. 1.50 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే పెండ్లిల్లు జరిగిన 150 మంది పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు చేయించి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే చెక్కుతో పాటు తన సొంత ఖర్చు ఖర్చుతో చీరను అందిస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాక, రాకముందు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయనే విషయాలను ప్రజలు గమనించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షే, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల తీరు గురించి టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ధాన్యం సేకరణ గురించి కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేనప్పటికి తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగల్ ఇచ్చిందన్నారు. 7వ తేదీ నుంచి జిల్లాలనే మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని సిద్దారంలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, సీనియర్ నాయకులు గాదె సత్యనారాయణ, చల్లగుళ్ల నరసింహారావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, వనమా వాసుదేవరావు, మందపాటి రవీంద్రరెడ్డి, నరుకుళ్ల శ్రీనివాసరావు, మల్లూరు అంకమరాజు, వల్లభనేని పవన్, వేములపల్లి మధు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, ఎస్కే చాంద్‌పాషా, కాకర్లపల్లి ఎప సర్పంచ్ పెద్దిరాజు పాల్గొన్నారు.