Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన
నవతెలంగాణ-కారేపల్లి
మధ్యాహ్న భోజన పధకంలో పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన వర్కర్లు సీఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట అందోళన చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పధకంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు గత విద్యా సంవత్సరం మూడు నెలలు ఈ విద్యాసంవత్సరానికి చెందిన రెండు నెలలు మొత్తం 5 నెలలు బిల్లులు రాక పోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మధ్యాహ్న భోజనం కోసం వర్కర్లు కిరాణా షాపుల్లో అప్పులు చేశారని బిల్లు రాక పోవటంతో అధిక వడ్డీలకు పైకం తెచ్చి కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పంధించి బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో కే.జమలారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.నాగేశ్వరరావు, సీఐటీయు నాయకులు తలారి దేవప్రకాశ్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు విక్టోరియా, కోటమ్మ, లక్ష్మి, శేరు లలితమ్మ, రమాదేవి, సుజాత,, చంద్రకళ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.