Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆసరాగా ఉండే క్రాప్ ఇన్సూరెన్స్ సక్రమంగా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, బండారు రమేష్ అన్నారు. శుక్రవారం వైరా మండలం గన్నవరం గ్రామంలో సిపిఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతులు శీలం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా రైతు సమస్యల గురించి బొంతు రాంబాబు, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి బండారు రమేష్, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం గురించి బోడపట్ల రవీందర్ సభ్యులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేయడం లేదని దీనివలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ వ్యవసాయ సీజనులో నష్టపోయిన రైతుల పంటలను కనీసం వ్యవసాయ శాఖ సందర్శించి నష్టం అంచనాలను తాయారు చేయడం లేదని అన్నారు. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మాగంటి తిరుమలరావు, కిలారు శ్రీనివాసరావు, బాజోజు రమణ, బాణాల శ్రీనివాసరావు, కారుమంచి జయరావు, పుష్షారాజ్యం, ఎంపిటిసి మాగంటి సుందరమ్మ, చిత్తారు నాగరాజు, శీలం విష్ణువర్ధన్ రెడ్డి, మద్దెల బాబురావు, రాంరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వజ్రమ్మ, పౌలు, మల్లయ్య, సుధాకర్, బుంగా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.