Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
వరి పంట సాగు పైన ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని ముసలిమడుగు గ్రామంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి పంటలు వేయొద్దని ఆదేశాలు జారీ చేయటం, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి వ్యవసాయ శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుందని, రైతులకు ప్రధానమైన పంట వరి తప్ప మరొకటి లేదని వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పంట సాగు పైన విధించిన ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎస్.కె మొహిద్దిన్, సిహెచ్.బాబూరావు, సీతారామయ్య, సత్యం, వెంకటి, వెంకటపతిరాజు, బి.వెంకటరాజు కే.చంద్రరావు, జై.గంగయ్య, వెంకటకష్ణ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.