Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 7వ తేదీన ఖమ్మం ఉమ్మడి జిల్లాల బాల్ బ్యాట్మెంటన్ బాలుర, బాలికల విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక చేయనున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు, కోచ్ అమరెసి లింగయ్య, పిఈటి వీరరాఘవయ్య తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో బాలుర, బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు తీసుకొని రావాలని కోరారు. సెలక్షన్ ట్రయల్ లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా తెల్లటి నిక్కరు, టీ షర్ట్ ధరించాలని కోరారు. సబ్ జూనియర్ ఈ విభాగంలో 2.1.2006 తరువాత పుట్టిన వారు అర్హులని తెలిపారు జూనియర్ విభాగంలో2.1.2002 తర్వాత పుట్టిన వారు అర్హులని తెలిపారు.