Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
ప్రేమించిన అమ్మాయి వేరొకరిని వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ ప్రియుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ సంఘటన మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని రాయన్నపేట గ్రామానికి చెందిన తోటపల్లి నరేష్(23) అనే యువకుడు డెలివరీ డాట్‌కామ్‌లో కొరియర్ బారుగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి నరేష్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలియటంతో ఆ యువతని మందలించి పెళ్లి చేయాలని నిర్ణయించారు. గత నెల అక్టోబర్ 29న తల్లిదండ్రులు ఆ యువతికి పెళ్లి చేశారు. దీంతో నరేష్ తాను ప్రేమించిన యువతి దూరం కావడంతో వారం రోజుల నుంచి తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. గురువారం రాత్రి 11 గంటల వరకు రాయన్నపేట గ్రామంలోనే ఉన్నట్లు బంధువులు తెలిపారు. తీవ్ర మనోవేదనకు గురైన నరేష్ బోనకల్ రైల్వే విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో దిగువ లైన్‌పై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒకే ఒక కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు సుందర్రావు, సునంద రోదన మిన్నంటింది.