Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్లుఅందిస్తున్న మిషన్ భగీరథ పథకం పైపులు లీకై వారం రోజుల నుండి వరద నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, గ్రామస్తులు, ఆవేదన చెందుతున్నారు. మండల పరిధిలోని పెద్ద గోపవరం నుండి ఎర్రుపాలెం వెళ్లే రోడ్డు మార్గంలో పైపులు పగిలిపోయి జలమయం అవుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. వారం రోజుల నుండి నిత్యం నీరు పారడంతో వరి కోతకు వచ్చిన పంట పొలాలలోకి నీరు వస్తున్నాయని, పండిన వరి పంట తడిసి పోతుందని రైతులు ఆగ్రహాన్ని వెళ్లబుచ్చుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. రోడ్డుపైన పారుతున్న నీరు వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని వాహన దారులు వెంటనే పైపులను మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు పగిలిన పైపులకు మరమ్మతులు చేసి పారుతున్న నీటిని అరికట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.