Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధితులకు ఇంటి వద్దే చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-వైరా
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మండలంలో పలు గ్రామాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పంపిణీ చేశారు. గోవిందాపురంలో రామాల రమేష్, విప్పల మడకలో గరిడేపల్లి నాగమణి, తెళ్లూరి కళ్యాణ్, మేడా శరాబంది, పినపాకలో మందలపు అనసూయ, ముసలి మడుగు లోసొర కుక్క కృష్ణ, తాటిపూడిలో రేగళ్ళ అన్నపూర్ణ, గొల్లెనపాడులో జుజ్జూరు ప్రవీణ, అష్ణగుర్తిలో తాళ్ళ సుజాతలకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందించారు. ఇప్పటి వరకూ లబ్ధిదారులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు పిలిపించి పంపిణీ చేసే వారు. లబ్ధిదారుల సౌకర్యార్థం ఎమ్మెల్యే స్వయంగా గ్రామాలలో పర్యటించి లబ్ధిదారుల కుటుంబ సభ్యుల కలిసి పంపిణీ చేయటం నూతనత్వమే గాక పలువురితో పరిచయాలకు ఉపయోగించుకున్నట్లు తెలిసింది. అంతేగాక అనారోగ్యంతో మృతి చెందిన, బాధపడుతున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జడ్పి కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహమ్మద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పసుపులేటి మోహనరావు, సర్పంచ్లు ఇటికాల మురళీ, బుద్దా సురేష్, తుమ్మల జాన్ పాపయ్య, విప్పలమడక ఎంపీటీసీ బూరుగు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.