Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రమాదాలు, అనారోగ్యాల బారినపడి ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందుతున్న సాయం కొంత వరకు భరోసా కలిగిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో పలు వార్డుల్లో ఉన్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందించారు. దీంతో పాటు ఇటీవల కాలంలో పెండ్లిళ్లు చేసుకున్న 7గురు పేదింటి ఆడపడుచులకు ఒక్కొక్కరికి రూ. 1.00.116లు విలువగల చెక్కులతో పాటు సొంత ఖర్చుతో చీరను అందిజేశారు. నియోజకవర్గంలో అక్టోబరు నెలలో మంజూరైన 266 చెక్కులను వారం రోజుల పాటు ఇంటింటికి వెళ్లి అందించే కార్యక్రమం పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, నాయకులు గాదె సత్యనారాయణ, చల్లగుళ్ల నరసింహారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, మల్లూరు అంకమరాజు, నడ్డి ఆనందరావు, నరుకుళ్ల శ్రీను, కౌన్సిలర్లు చాందపాషా, గ్రాండ్ మౌలాలి, మట్టా ప్రసాద్, ఖాతూమ్గఫార్, దూదిపాల రాంబాబు, రాఘవేంద్ర, పాల్గొన్నారు.