Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు నగర మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు, తెరాస నేతలు వినతి పత్రం అందజేశారు. పేదల ప్రజల కొరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజరు కుమార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన కేసీఆర్ టవర్స్, 42 బ్లాకులు 1008 డబుల్ బెడ్రూం ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజల విజ్ఞప్తి మేరకు రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులు అదనంగా ఉదయం, సాయంత్రం, 4 ట్రిప్పులు తిరిగే విధంగా కోరారు. రేషన్ షాప్‌ను ఏర్పాటు చేయాలని, చదువుకునే పిల్లల కొరకు పాఠశాలను ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా ముక్తార్, పగడాల శ్రీవిద్య, దాదే అమృత అమ్మ, కమర్తపు మురళి, బుర్రి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు సౌకత్ అలీ, కమిటీ సభ్యులు ప్రెసిడెంట్. సాజిదా రహీం, సెక్రెటరీ. నలబోలు మధులత, వైస్ ప్రెసిడెంట్ మంజుల ఉన్నారు.