Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినందించిన వాహనదారులు
నవతెలంగాణ-కొణిజర్ల
లాలాపురం, తీగలబంజర గ్రామాల మధ్య ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయంగా ఏర్పడి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుండటంతో స్పందించిన ర్యాన్ కేర్ లైట్ వెయిట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీలో ఉన్న డస్ట్‌తో గుంతలను పూడ్చారు. స్వయంగా ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ టివి రమణచౌదరి సిబ్బందితో కలిసి ట్రాక్టర్లో ఉన్న డస్ట్‌ను గుంతల్లో పోశారు. దీంతో వాహనదారులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో బ్రిక్స్ ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు.