Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు, ఏఈయస్ కిరణ్ సూచనలతో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలం పట్టణంలో వాహనాల తనిఖీలు చేశారు. మోటార్ సైకిల్ పై ఎండు గంజాయిని భద్రాచలం నుండి కామారెడ్డికి రవాణా చేస్తున్న పీపావత్ సేవియ, పిపావత్ అనిత వద్ద నుండి 12 కేజీల ఎండు గంజాయిని, మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసును నమోదు చేసి తదుపరి చర్యలు నిమిత్తం వీరిని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగిస్తామని సిఐ సర్వేశ్వర్ తెలిపారు. పట్టుకున్న ఎండు గంజాయి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1.50 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీలో యస్ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్స్ కరీం, బాలు, కానిస్టేబుల్స్ సుధీర్, హరీష్, వెంకట్ లుతదితరులు పాల్గొన్నారు.