Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండలంలోని బయ్యారం గ్రామంలో సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్తో వరి విత్తనాలు వేసిన పొలాలను సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. గ్రామానికి చెందిన రైతు ముక్కు సుబ్బారెడ్డి వివిధ రకాల విత్తన మోతాదులను ఉపయోగించి వరి విత్తనాలను వేసిన పొలాలను సందర్శించారు. వివిధ రకాల విత్తన మోతాదులో అంటే 5కేజీలు, 6, 8, 9, 12, 15 కేజీలు విత్తన మోతాదులను ఉపయోగించి ప్రయోగాత్మకంగా వరి పంటను పండిస్తున్నారు. ఈ వరి పంట పొలాలను సందర్శించిన అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. దీనివలన రైతులకు విత్తన పెట్టుబడి, కూలీల ఖర్చు తగ్గి దిగుబడి కూడా పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు కోఆర్డినేటర్ దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ముక్కు బాల సుబ్బారెడ్డి, మల్లయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మణ్ రావు, కేశవ రావు, రమేష్, తదితర రైతులు పాల్గొన్నారు.