Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట బ్లాక్‌లోని బటేర్ గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి సాయుధులైన మావోయిస్టులు గ్రామానికి వచ్చి ఐదుగురిని తమ వెంట తీసుకెళ్ళినట్లుగా తెలుస్తున్నది. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. నక్సల్స్ వద్ద బందీగా ఉన్న వారిని విడిపించడానికి గ్రామస్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి ఏ హాని తలపెట్టకుండా క్షేమంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది. సుక్మా ఎస్పి సునీల్ శర్మ ఈ ఘటనపై స్పందించారు. గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం లేదన్నారు. మావోయిస్టులు గ్రామానికి వచ్చి బలవంతంగా సమావేశానికి తీసుకెళ్ళినట్లుగా తమకు తెలిసిందని పోలీసులు చెప్పారు.