Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
శాంతి భద్రతలలో, మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఐ బి కొండలరావు కృషి మరువలేనిదని జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శాంతి స్నేహ యూత్ ఆధ్వర్యంలో బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఎస్ఐ బి కొండల్ రావుని ఆదివారం ఘనంగా సన్మానించారు. ఎస్ఐ కొండలరావు ఖమ్మం బదిలీ అయిన సంగతి విధితమే. ఎస్ఐ కొండల్ రావుని లింగాల కమల్ రాజు శాంతి స్నేహ యూత్ అధ్యక్షుడు, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ అమరేసి లింగయ్య బోనకల్లు సొసైటీ అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, బోనకల్లు మాజీ సొసైటీ అధ్యక్షుడు గుండపనేని సుధాకర్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ ఎస్ఐ మండలంలో పనిచేసిన సమయంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా విధులను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే స్థానిక సంస్థల ఎన్నికలు రావడం వాటిని సమర్థవంతంగా నిర్వహించడంలో విజయవంతమైన పాత్ర నిర్వహించారన్నారు. మండలంలో ఏ గ్రామంలో రాజకీయ ఘర్షణలు లేకుండా అన్ని రాజకీయ పక్షాలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి పోలీసు ఉన్నతాధికారులుచే శభాష్ అనిపించుకున్నారని కొనియాడారు. మండలంలో వివాద రహిత ఎస్ఐగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొనకంచి నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు తన్నీరు రవి, యార్లగడ్డ రాఘవరావు, వెనిగండ్ల మురళి, తన్నీరు పుల్లారావు, షేక్ హుస్సేన్ సాహెబ్, బంధం నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు, మోదుగుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.