Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
రైతు సమస్యలు పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.30 వరకు ఒక్క రోజు నిరసన దీక్ష ఖమ్మం టీడీపీ కార్యాలయంలో చేపడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, తెలంగాణ తెలుగు రైతు అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరి పంటని కొనుగోలు చేయకపోవట వల్ల రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సానబోయిన శ్రీనివాస్, పార్లమెంట్ ప్రధానకార్యదర్శులు వడ్లమూడి పూర్ణచందర్రావు, కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, మహిళ రాష్ట్రకార్యదర్శి మేకల.సత్యవతి, టిఎస్ఎన్వీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆకారపు శ్రీనివాస్, సంపత్, వడ్డెమ్ విజరు, బోదెపుడి రవి, చింతనిప్పు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు