Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మండలంలోని పేరుపల్లిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సీఆర్ఎఫ్ చెక్ ల పంపిణీ చేసే సమాచారం తమకు ఇవ్వక పోవటంపై వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ అజ్మీర నాగేశ్వరరావులు నిరసన తెలిపారు. బీక్యతండకు వచ్చిన ఎమ్మెల్యే ఎదుట తాము లేకుండా తమ గ్రామంలో చెక్ లను ఎలా పంపిణీ చేశారని, తమకు పార్టీ అధ్యక్షులు తోటకూరి రాంబాబు సమాచారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటోకాల్ తెలియదా మీకు అంటూ రాంబాబును నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారినుద్దేశించి సర్ధుక పోవాలని సూచించి అక్కడి నుండి వెళ్లిపోయారు. తాను సమాచారం ఇవ్వమని పార్టీ కార్యాలయ ఇంచార్జీ తొగరు శ్రీనుకు చెప్పానని టీఆర్ఎస్ అధ్యక్షులు రాంబాబు వివరణ ఇచ్చారు.