Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
పారుపల్లి నాగేశ్వరరావు
నవతెలంగాణ- వేంసూరు
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే కల్పించాలని టీఎస్యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కందుకూరులో జరిగిన మండల మహాసభకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. యుటిఎఫ్ మండల అధ్యక్షుడు మేకల ధర్మారావు అధ్యక్షతన జరిగిన 8వ మహాసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలో ఉందని కాపాడుకునేందుకు యుటిఎఫ్ అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని. ముఖ్యంగా పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభ ప్రారంభానికి ముందు రిటైర్డ్ సీనియర్ ఉపాధ్యాయులు దోసపాటి పుల్లారావు జెండా ఆవిష్కరించారు. ఈ సభలో అధ్యక్షుడు మేకల ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ఆచారి జిల్లా నాయకులు జిఎస్ఆర్ రమేష్ కార్యదర్శి నిర్మలా కుమారి. శ్రీనివాస రెడ్డి, దీనదయాళ్. చంద్రశేఖర్ పాల్గొన్నారు