Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
అ జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి
దేశంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సిద్దారం గ్రామంలో సత్తుపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సండ్ర మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులొచ్చినా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రూ.35వేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకు కేటాయించిందన్నారు. సంబంధిత శాఖామాత్యులు గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖా కమిషనర్‌తో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని ఇతర రాష్ట్రాల రైతుల వద్ద ధాన్యం మన పేరు మీద తీసుకురావద్దని హెచ్చరించారు. ఈ నేపధ్యంలనే ప్రభత్వం టోకెన్ సిస్టంను ప్రవేశపెట్టిందన్నారు. సొసైటీ అధ్యక్షులు, సీఈఓలు ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కొనుగోలు చేయాలని కోరారు. డీసీసీబీ ఛైర్మెన్ కూరాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీసీఎంఎస్ ఛైర్మెన్ శేషగిరిరావు, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దారు కేవీఎంఏ మీనన్, జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, సిద్దారం సర్పంచ్ నల్లంటి ఉదయలక్ష్మిజానకిరాం, సొసైటీ అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొన్నారు.