Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్హులకు డబుల్ ఇల్లు ఇవ్వాలని వేడుకోలు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లలో డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ పంపిణీలో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలలో వీఆర్ఓలు అత్యుత్సాహం చూపించారాని, ఈ పంపిణీలో వీరి పాత్ర ప్రధానమైన్నాదని చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయని అందరికి తెలిసిందే. ఖమ్మం త్రీటౌన్ లో ఆదివారం 47 డివిజన్ లో డబుల్ బెడ్ రూమ్స్ డ్రా లో తీసిన 40 మంది లబ్ధిదారులలో సగానికి పైగా ఇల్లు, ఉద్యోగం ఉన్నవారికే వచ్చాయని, ఆదివారం సాయంత్రం మోతినగర్లో డివిజన్ కార్పొరేటర్ ఇంటిముందు గంటసేపు ఆందోళన చేశారు. డ్రా తీసిన పద్ధతి ఉన్నవాళ్ళకొ అనుకూలంగా ఉందని మళ్ళీ ఎంక్వయిరీ చేసి లేనివాళ్లకు ఇల్లు వచ్చేలా చూడాలని... లేకపోతే డ్రా పద్ధతిని తీసివేయాలని వాపోయారు. వారం రోజులుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన మా బాధ పట్టించుకోలేదని వాపోయారు. ఎవరు పట్టించుకోవడం లేదని ఆదివారం స్థానిక కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరావు ఇంటి దగ్గరకి వచ్చి ఆందోళన చేశారు. కార్పొరేటర్ లేకపోవడంతో వెనుతిరిగారు.