Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఓట్లు దండుకున్న అధికారాన్ని చేపట్టిన తర్వాత మాట మార్చుతున్నాయనితెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయమని చెప్పటం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఆదివారం ఖమ్మం అర్బన్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం గ్రామంలో రైతులు వేసిన ఎటువంటి వరి పంటలను పరిశీలించారు. యాసంగిలో వరి వేయొద్దని అని చెప్పడం కూడా రైతులను మోసం చేసినట్టే అవుతుందని అన్నారు. యాసంగి వరిని కూడా యధావిధిగా పండించేందుకు రైతులు సక్రమంగా వరి విత్తనాలు అందించాలని అలా లేని పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న అన్ని గ్రామాల్లో రైతులను కలుపుకొని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 12న ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, అర్బన్ మండల కార్యదర్శి గోవిందరావు, రైతు నాయకులు చేతులు నాగేశ్వరావు, రుద్ర బోయిన మంగయ్య, చామకూరి రాము, శ్రీనివాసరావు, వడ్డె పూడి మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు, ఎలమంద రావు, అమరయ్య తదితరులు పాల్గొన్నారు.