Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బాల్ బ్యాట్మెంటన్ సబ్ జూనియర్, జూనియర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల బాలుర, బాలికల జట్ల ఎంపిక జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదివారం ప్రారంభించారు. తొలుత బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. బాల్ బ్యాడ్మింటన్ మొదటి కోర్టును ఎస్ఐ బి కొండలరావు, రెండవ కోర్టును శాంతి స్నేహ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు, బోనకల్ సొసైటీ అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం క్రీడా పోటీలను కమల్ రాజు ప్రారంభించారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి పోటీలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల మనిషి శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఒలంపిక్స్ పోటీలలో ఈ ఏడాది భారత క్రీడాకారులు అనేక క్రీడా పోటీలలో పాల్గొని తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి అనేక పథకాలు సాధించి క్రీడా పటంలో భారతదేశ పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారని కొనియాడారు. మనిషికి విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో శాంతి స్నేహ యూత్ అధ్యక్షుడు అమరెసి లింగయ్య, సీపీఐ(ఎం) ముష్టికుంట్ల శాఖ కార్యదర్శి షేక్ నజీర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, బోనకల్ ఉపసర్పంచ్ ఎర్రగడ్డ రాఘవరావు, బోనకల్లు సొసైటీ మాజీ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, యార్లగడ్డ చిన్న నరసింహ, మాజీ జడ్పీటిసి బానోత్ కొండ, టిఆర్ఎస్ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు మూడవత్ సైదా, టీఆర్ఎస్ నాయకులు కాకాని శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్ సాహెబ్, కొనకంచి నాగరాజు, తన్నీరు రవి తన్నీరు పుల్లారావు, బంధం నాగేశ్వరరావు, వెనిగండ్ల మురళి తదితరులు పాల్గొన్నారు.
బాల్ బ్యాట్మెంటన్ రాష్ట్రస్థాయి పోటీలకు
జిల్లా జట్టు ఎంపిక
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బాల్ బాడ్మింటన్ సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల విభాగాలలో జిల్లా జట్లను ఆదివారం ఎంపిక చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎస్ఐ బి కొండలరావు తదితరులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపికైన జిల్లా జట్లు ఈనెల 26, 27, 28 నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని కోచ్ అమరేష్ లింగయ్య తెలిపారు. జూనియర్ బాలుర విభాగంలో యన్. గోపి, ఆర్. రాకేష్, జె. ఓంకార్, ఎం. కిషోర్, కె. యశ్వి విజరు, ఎం. దుర్గ మల్లేష్ ఎస్ డి. అమీర్, బి. లోకేష్, ఏ. మనోజ్, ఏ. వివేక్, కె. జీవన్ కుమార్, సిహెచ్. భాను ఎంపికయ్యారు. జూనియర్ బాలికల విభాగంలో శేషికల, సహస,కీర్తి, పావని, నవ్య, హనీ, రేవతి,చందన, గాయత్రి, వెంకమ్మ, ధరణి, హాసిని ఎంపికయ్యారు.సబ్ జూనియర్ బాలుర విభాగంలో జి. గణేష్, జి. గోపి, బి. నాగనాయక్, కె. జయదీప్, షేక్. షాహిద్, కె. మోహిత్, నవీన్ నాయక్, కె. ఉపేందర్, జి.సురేష్, జి. శివ ఎంపికయ్యారు.సబ్ జూనియర్ బాలికల విభాగంలో సహస్ర, కీర్తి,హనీ, శ్రీ హర్ష, జశ్వంతి, త్రివేణి, ధరణి, హర్షిణి, పౌర్ణమి, ఆకాంక్ష ఎన్నికయ్యారు. ఈ ఎంపిక లో పలువురు పి టి లు బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.