Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రపంచ ప్రజలకు స్ఫూర్తిని అందించిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్ అధ్యక్షతన 104వ అక్టోబర్ విప్లవ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సభలో అయన మాట్లాడుతూ.. ప్రపంచంలో మొట్ట మొదటిసారి మనిషి తనను తాను విముక్తి చేసుకొని, తన కోసం తానే నిర్మించుకున్న నూతన సమాజాన్ని ఈ విప్లవం ద్వారా సాధించాడని తెలిపారు. విప్లవం విజయవంతం అయిన తర్వాత రష్యాలో భూస్వామ్య వ్యవస్థను రద్దుచేసి, మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 15 సంవత్సరాల వరకు ఉచిత నిర్భంద విద్యను అమలు చేశారని తెలిపారు. ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారని అన్నారు. విప్లవం వచ్చిన 10 సంవత్సరాల లోపే ప్రతి చదువుకున్న యువతకు ఉద్యోగాలను అందించారన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్కువ ధరలకు అందించే ప్రయత్నం చేశారని అన్నారు. అంతకు ముందు ఉన్న 12 నుండి 14 గంటల పని విధానాన్ని రద్దుచేసి, వారంలో 5 పని దినాలు, కేవలం గంటల పని విధానాన్ని అమలుపరచి, కార్మికులకు ఊరట కల్పించారని తెలిపారు. అక్టోబర్ విప్లవం విజయవంతం కాగానే, రష్యాలో -మహిళలందరికి ఓటు హక్కు కల్పించి, పురుషులతో సమానంగా వేతనాలు అందించారని అన్నారు. అక్టోబర్ విప్లవం ప్రపంచ దేశాలపైన ప్రభావం చూపిందని, ముఖ్యంగా భారతదేశంపైన ప్రభావం చూపిందని తెలిపారు. భారత స్వాతంత్రోద్యమ నాయకులకు స్ఫూర్తిని ఇచ్చిందని, స్వాతంత్య్ర పోరాటానికి పరోక్ష మద్దతు ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటి సభ్యులు మెరుగు సత్యనారాయణ, నండిపాటి మనోహర్, మాదినేని రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్, నాయకుల నర్సయ్య, వీరభద్రం, ఆస్టల్, డాక్టర్ భారవి, నాదెండ్ల శ్రీనివాస్, మాచర్ల గోపాల్, పాపినేని రామనర్సయ్య, జె. నాగేశ్వరరావు పాల్గొన్నారు.
.