Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కారేపల్లి
ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింది మంజూరైన చెక్‌లను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కారేపల్లి మండంలోని లబ్దిదారులకు ఆదివారం ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. గిద్దవారిగూడెం, కారేపల్లి, పేరుపల్లి, సూర్యాతండా, భీక్యాతండా, రేలకాయలపల్లిలోని 9 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారుల ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్య విషయాలను తెలుసుకొని ఎమ్మెల్యే రూ.315500 విలువైన చెక్ లను అందజేశారు. ఈ సందర్బంగా లబ్జిదారులను ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను స్ధితి గతులను సమస్యలను క్షేత్రస్ధాయిలో తెలుకోవటానికి ఇదోక అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి నుండి ఏ పధకమైన ఇంటికే వెళ్ళి అందించటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను సూర్యతండా సర్పంచ్ దంపతులు జర్పుల శాంతి -హచ్చలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయన, ఎంపీపీ మాలోత్ శకుంతల,సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ దారావత్ మంగీలాల్, టీఆర్ఎస్ అద్యక్షప్రధాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, రైతు బంధు మండల కోఆర్డినేటర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్ లు ఆదెర్ల స్రవంతి, అజ్మీర అరుణ, జర్పల శాంతి హచ్చు, మాలోత్ కిషోర్, బానోత్ కుమార్, బానోత్ శంకర్, మొగిలి ఆదినారాయణ, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు దారావత్ పాండ్యానాయక్, పెద్దబోయిన ఉమాశంకర్, హనీఫ్, యూత్, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మీర యుగేంధర్, గుగులోత్ రమేష్ పాల్గొన్నారు.