Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అశాస్త్రీయంగా హక్కుపత్రాల ప్రక్రియ
అ శాటిలైట్ సర్వేతో పోడు గుర్తింపుపై
సందేహాలు
అ ప్రభుత్వానికి లోపించిన చిత్తశుద్ధి
అ చట్ట విరుద్ధ చర్యలపై విపక్షాల
మండిపాటు
అ నోటిఫికేషన్ లేకుండానే నేటి నుంచి
దరఖాస్తులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
అటవీ పరిరక్షణ పేరుతో పోడుదారుల హక్కులను హరించి వేయాలనే దృక్పథం తప్ప...పోడు గిరిజనులకు న్యాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదు. పోడు సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధి కనిపించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్త నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ఇష్టారీతిలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు సమాయత్తం అయింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా అరకొర పోడుభూ ములకు హక్కుపత్రాలు ఇచ్చి చేతులు దులుపు కోవాలనే యోచన కారణంగా ఈ ప్రక్రియలో ఎక్కడా నిజాయితీ కనిపించడం లేదని విపక్ష నేతలు అంటున్నారు.
- దరఖాస్తులు మొదలు దగానే..!
గ్రామసభల ద్వారా గిరిజన, గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామంటున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, అటవీ బీట్ అధికారి, మండల సర్వేయర్‌తో కూడిన బృందం సోమవారం నుంచి ఏ ఫారంలో ఎలా దరఖాస్తులు సమర్పించాలో అవగాహన కల్పించి అర్జీలు స్వీకరిస్తుందని చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ప్రతీ గ్రామంలో అటవీ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు, పంచాయతీల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. సర్వే నిర్వహించి, గ్రామ పెద్దల నుంచి వాగ్మూలం తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ చట్టం ద్వారా హక్కులు కల్పించింది. కానీ ఈ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలోనే ఈ తతంగం అంతా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లుగా పోడుదారులను ఇబ్బందులకు గురిచేసిన ఫారెస్టు సిబ్బంది...ఇప్పుడు పట్టాలిప్పిస్తామనే పేరుతో లంచాలకు తెరదీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా బినామీలు పట్టాలు పొందే ప్రమాదం ఉంది. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా అర్హుల ఎంపిక చేస్తామన్నారు కానీ కొన్ని జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలూ నిర్వహించనేలేదు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోనే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. ఫారెస్టు అధికారులు వంద కుటుంబాలుంటే 40 మందికే హక్కు పత్రాలు ఇస్తామని చెబుతున్నారు. గిరిజనేతరుల విషయంలో స్పష్టత లేదు. గిరిజనేతరులకు ఆటంకంగా మారిన చట్ట సవరణ విషయాన్ని అఖిలపక్షంతో కలిసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు మూడు తరాలు (75 ఏళ్లు)గా ఉంటున్న గిరిజనేతరుల నుంచీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇలాంటి ఎన్నో సందేహాల మధ్య దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది.
- చట్ట విరుద్ధ చర్యలెన్నో...!
అటవీ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం చట్ట విరుద్ధ చర్యలెన్నింటికో పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం అటవీ గ్రామాలను యథాతథంగా ఉంచాలి. వాటిని రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి. రోడ్లు, కరెంట్, నీరు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించాలి. డిసెంబర్ 13, 2005కు ముందున్న వారికి అటవీహక్కులు కల్పించాలి. సెక్షన్ 4(5) ప్రకారం అటవీగ్రామాలను బయటకు తరలించడం చట్ట విరుద్ధం. అటవీహక్కు పత్రాల పంపిణీ తర్వాత ఇటువంటి గ్రామాలను బయటకు తరలించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రహరీగోడలు నిర్మించడం, కందకాలు తవ్వడం వంటి చర్యలు చేపడుతామని ప్రకటిస్తోంది. పర్యావరణ గ్రామాల ను ఇలా విచ్ఛిన్నం చేయడం సరికాదని విపక్షాలు, గిరిజన, ఆదివాసి సంఘాలంటున్నాయి. ఇక శాటిలైట్ సర్వే మరో చట్ట విరుద్ధ చర్య. శాటిలైట్ చిత్రాల ద్వారా పోడుసాగును అనేక రెట్లు తక్కువ చేసి చూపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శాటిలైట్ చిత్రాలు సాక్ష్యాలుగా పనికిరావని అటవీ హక్కుల చట్టం చెబుతోంది. దరఖాస్తు ఇచ్చిన సాగు దారుల భూములను క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ధా రణ చేసుకోవాలి తప్ప శాటిలైట్ చిత్రాల ద్వారా నిర్ణ యించడం సరికాదని విపక్ష నేతలు అంటున్నారు.
- శాటిలైట్ సర్వే ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోడుభూములు
+ ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాల్లో పోడు భూములు సత్తుపల్లి 3,208, కొణిజర్ల 3,682, కారేపల్లి 4,673, పెనుబల్లి 1,580, రఘునాథపాలెం 1,795, కామేపల్లి 988, ఏన్కూరు 1,087, తల్లాడ 270, చింతకాని 130, వేంసూరు 31 ఎకరాలుగా నిర్ధారించారు.
+ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆళ్లపల్లి 15,514, అన్నపురెడ్డిపల్లి 1,826, అశ్వాపురం 8,198, అశ్వారావుపేట 16,262, బూర్గంపహాడ్ 7,257, చండ్రుగొండ 1,987, చర్ల 7,431, చంచుపల్లి 1,418, దమ్మపేట 2,762, దుమ్ముగూడెం 15,097, ఏన్కూరు 113, గుండాల 32,813, జూలుపాడు 5,151, కరకగూడెం 11,328, మణుగూరు 2,813, ముల్కపల్లి 19,740, పాల్వంచ 1,987, పినపాక 6,445, సుజాతనగర్ 2,096, టేకులపల్లి 25,948, ఇల్లందు 22,726, లక్ష్మీదేవిపల్లి 11,646 ఎకరాలున్నట్లుగా తేల్చారు.