Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి ఎస్సైగా విధులు నిర్వర్తించి ఖమ్మం సీసీఎస్కు బదిలీ అయిన ఎస్సై పీ.సురేష్, ట్రైనీ ఎస్సైగా పని చేసి వైరాకు బదిలీ అయిన వాసిరెడ్డి వీరప్రసాద్ లను కారేపల్లి జర్నలిస్టులు సన్మానించారు. పోలీస్ స్టేషన్ లో ఇరువులు ఎస్సైలను శాలువలు కప్పి పుష్ప గుచ్చాలు ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై పీ.సురేష్ మాట్లాడుతూ ఏడాది కాలంగా పని చేసినతనకు సహాయ సహకారాలు అందించటంపై కతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ లోఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించి ఎస్సై కు ఇదే సహయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కే.వెంకటేశ్వర్లు, ఏపూరి లక్ష్మినారాయణ, దమ్మాలపాటి కష్ణ, బానోత్ బాలు, గుడెల్లి శ్రీనివాసరావు, వేములపల్లి సత్యనారాయణ, తేళ్ల శ్రీనివాసరావు, బయ్య నాగేశ్వరరావు, ఆదెర్ల శంకర్, అశోక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.