Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీవైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పిలుపు
అ ఘనంగా డివైయఫ్ఐ వైరా పట్టణ మహాసభ
నవతెలంగాణ - వైరా టౌన్
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఉద్యోగాల సాధన కోసం యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక బోడెపుడి వెంకటేశ్వరరావు భవనంలో సంఘం వైరా పట్టణ మహాసభ చితారు మురళి అధ్యక్షతన జరిగింది. మహాసభ ప్రారంభ సూచికగా డీవైఎఫ్ఐ జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ ఆవిష్కరించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటానికి, అమవీరులకు మహాసభకు హాజరైన ప్రతినిధులు, అతిధులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఏడేళ్ల దాటిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని అన్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యాలు అన్ని ప్రభుత్వాల హత్యలే అని ఆయన అన్నారు. ఈ మహాసభలో జిల్లా ఉపాధ్యక్షుడు సత్తెనపల్లి నరేష్, సీఐటీయు జిల్లా నాయకులు సుంకర.సుధాకర్, వ్యకాస నాయకులు గుమ్మా నర్సింహారావు, సోషల్ మీడియా కన్వీనర్ గుడిమెట్ల మోహన్ రావు, డి.వై.యఫ్.ఐ మాజీ డివిజన్ కార్యదర్శి వర్మ యాదవ్, నాయకులు గుడిమెట్ల వెంకట రోషన్ తదితరులు పాల్గొన్నారు.