Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్
నవతెలంగాణ-గాంధీచౌక్
వరుసగా ఏడేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే స్థాయిలో ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. స్థానిక గుమస్తాల సంఘం భవనంలో సోమవారం యర్రా శ్రీకాంత్ ఈ-శ్రమ కార్డు ఉపయోగాలు హమాలీలకు తెలియజేశారు. ప్రతి అసంఘటిత కార్మికుడికి యుఏఎన్ ( యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వం అందించే అన్ని రకాల సామజిక, సంక్షేమ పథకాలు వరిస్తాయిని, పిఎంఎస్బివై క్రింద 2 లక్షల ప్రమాద బీమా మరియు అంగవైకల్యం బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం స్థానిక గుమస్తాల సంఘం భవనం నుండి గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహం వరకు ధరలు తగ్గించాలని నిరసన ప్రదర్శన గాంధీ విగ్రహం చుట్టూ మానవహారం చేపట్టారు. అనంతరం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడానికి ధరలు తగ్గించడానికి కేంద్రం రాష్ట్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, తుశాకుల లింగయ్య, టీ విష్ణు, టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ కే సైదులు, పత్తిపాక నాగ సులోచన, బండారు వీరబాబు, శీలం వీరబాబు, ఎస్.కె ఇమామ్, టౌన్ కమిటీ సభ్యులు పాశం సత్యనారాయణ పాల్గొన్నారు.