Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ-వైరా
వైరా సమీపంలోని పామాయిల్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని వైరా ట్రైనీ ఎస్ఐ యాయాతి రాజు సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. మండలంలోని ఖానాపురం గ్రామానికి ఖాదర్ తన ఆటోలో తీసుకొచ్చిన 10 క్వింటాళ్ల బియ్యాన్ని పామాయిల్ తోటలో ఉంచిన విషయం గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న రాజు హుటాహుటీన అక్కడికి వెళ్లి బియ్యాన్ని పట్టుకున్నారు. ఇతర ప్రాంతాలలో కొనుగోలు చేసిన బియ్యాన్ని కూడా ఇక్కడికి తరలించి లారీతో తరలించే ప్రయత్నంలో 10 క్వింటాల్ మాత్రమే పట్టుబడినవి ఖాదర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.