Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామాలలో విద్యుత్ అంతరాయం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని జగ్గాయిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా 300 సోలార్ లైట్లు, 200 బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ మండలంలోని కిష్టాపురం (బాటన్ననగర్) పాఠశాల ఉపాధ్యాయుడు సత్తులాల్ చేతన ఫౌండేషన్ సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎంఈఓ పెండెకట్ల క్రిష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సత్తులాల్, చేతన ఫౌండేషన్ సభ్యులు రషీద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.