Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ 2021-2023 ప్రకారం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు మద్యం షాపుల కేటాయింపులను లాటరీ పద్ధతిన నిర్దారించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాటరీ పద్ధతిన రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ డ్రా తీశారు. ఖమ్మం జిల్లాకు అనుమతించిన 122 మద్యం షాపులకు గాను 6 మద్యం షాపులు ఏజెన్సీ ఏరియాలోని స్థానికులకు కేటాయించారు. మిగతా 116 మద్యం దుకాణాలను ప్రభుత్వ అనుమతించిన విధంగా ఎస్సీలకు (14), గౌడ కులస్తులకు 18, ఎస్టీలకు (2) లాటరీ పద్ధతిన కేటాయించామని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కష్ణనాయక్, జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖాధికారి కె. సత్యనారాయణ, జిల్లా బి.సి సంక్షేమ శాఖాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.