Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కమ్యూనిస్టు అంటేనే కాల్చి చంపే రోజుల్లోనే ఎర్రజెండాను చేత పట్టారని, తుది శ్వాస వరకు ఆ జెండా నీడనే నికరంగా నిలబడ్డారని, తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఎర్రె ఎర్రని తోరణాలు కిందే వేగుచుక్కలా అంతిమయాత్ర కొనసాగిందని కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరిలూదిన అమరజీవి కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య అని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు కొనియాడారు. మధిర మాజీ సమితి అధ్యక్షులు కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య ఏడవ వర్ధంతి ఆదివారం రాత్రి తన స్వగ్రామమైన మీనవోలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో పొన్నం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, పుల్లయ్యతో పాటు సహచర సభ్యుడిగా పని చేశానని, అందుకు నాకు చాలా గర్వంగా ఉందని ఎప్పుడూ పదవుల కోసం ఆశించని వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా తొలుత వీరయ్య మాట్లాడుతూ రామిశెట్టి పుల్లయ్య సమితి అధ్యక్షులుగా అందించిన సేవలు మరువలేనివి, ప్రజా సమ స్యలు తప్ప పదవుల కోసం ఏనాడు ఆశించలేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మాదినేని రమేష్, మధిర నియోజవర్గ ఇన్చార్జి చింతలచెరువు కోటేశ్వరరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లమోతుల హనుమంతురావు, కూడెల్లి నాగేశ్వరరావు, రామిశెట్టి సురేష్, రామిశెట్టి కోటేశ్వరరావు, గోగినేని గోపాలరావు, పసుపులేటి శివకృష్ణ, షేక్ నాగుల్ మీరా, షేక్ మదీనా, మేకల పుల్లయ్య, కుర్ర వెంకటరామయ్య, నండ్రు ప్రభుదాసు, మన్నె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.