Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యా అభివృద్ధి సమీక్షా సమావేశం (డీసీఈడీఆర్సీ) కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూదన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో 2018-19, 2019-20 వార్షిక విద్యాసంవత్సరాలపై చర్చించారు. విద్యార్థుల ప్రవేశాలు, ఫలితాలు, కళాశాల స్థలాలు, భవన నిర్మాణాలు, ఉపకార వేతనాలు, విద్యార్థులు- అధ్యాపకుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్, డీసీఈడీఆర్సీ జిల్లా కన్వీనర్ మహ్మద్ జకీరుల్లా, ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాసులు, ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాల, జీడీసీ నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర కళాశాలల ప్రిన్సిపాళ్లుజి.పద్మావతి, పరంజ్యోతి, ఎన్.రామచందర్రావు, ఏఎల్ఎన్ శాస్త్రి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాధికారులు, వివిధ విభాగాల ఇంజినీర్లు, ఎంప్లాయిమెంట్ అధికారులు పాల్గొన్నారు