Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాల(ఆర్జేసీ) కృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్సిబాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్షీ ప్రసన్న, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ అధ్యక్షులు కమర్తపు మురళి, చిరుమామిళ్ళ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఆయన్ని గజమాల, ప్రత్యేకంగా తయారు కిరీటంలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు తాజ్ ఇషాక్, జిలాని, అశ్రీఫ్, ముక్తార్ దారు, మజీద్ మున్నా, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య, నాయకులు మాటేటి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.