Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతు గుర్రం నాగయ్యకు ఖమ్మం వెంకటరమణ ఆటో మొబైల్స్ ట్రాక్టర్ షోరూమ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రాలో విజేతగా నిలవడంతో ట్రాక్టర్ ట్రక్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు సోమవారం కోటకొండ లో అందజేశారు. మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ నిర్వాహకులు ప్రతి 20 ట్రాక్టర్లు కొన్న రైతులకు ట్రక్కు ఉచితంగా అందించడం కోసం 20 మంది రైతుల పేర్లలో ఒక రైతు పేరును లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి విజేతకు లక్షా యాభైవేల రూపాయలు విలువచేసే ట్రక్కును విజేతకు అప్పగించారు. అనంతరం పాపినేని రామారావుతో పాటు కొంతమంది రైతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహేంద్ర షోరూం సేల్స్ జనరల్ మేనేజర్ హుస్సేన్ చౌదరి, మేనేజర్ వీరేంద్ర కుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ టిఆర్ఎస్ మండల అధక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ గ్రామ రైతు కన్వీనర్ కంచర్ల అచ్చయ్య, కన్నేటి సురేష్, పాపినేని కృష్ణ, దుంపల సురేందర్, సాధినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.