Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా నాయకురాలు పాకలపాటి ఝాన్సీ
- గ్యాస్‌బండతో మహిళల నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-సత్తుపల్లి
పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా జిల్లా నాయకురాలు పాకలపాటి ఝాన్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక గుడిపాడు సెంటర్లో ఐద్వా సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్‌బండ ఓ వైపు ఉంచి కట్టెలపొయ్యిపై వంట వండుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ మోదీ అధికారంలోకి రాకముందు గ్యాస్ బండ రూ.600 ఉండేదన్నారు. నేడు రూ.1000పై చిలుకు ధరను పెంచేసి పేద,మధ్యతరగతి గృహిణులకు మళ్లీ కట్టెలపొయ్యే శరణ్యమయ్యే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిగుళ్ల లకీë, కొల్లి పద్మ, కుమారి, చావా కవిత, స్థానిక మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.