Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- గాంధీచౌక్
ఖరీఫ్ 2021-22 సీజన్ లో ధాన్యం సేకరణపై జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముఖ్య కార్యనిర్వరహణాధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీటింగ్ హాల్ లో జిల్లా సహకారాధికారి ఎ.విజయకుమారి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ హాజరయ్యారు. జి.ఓ.నెం: 13 ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలు తప్పని సరిగా పాటించి ధాన్యం కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. ఎఫ్ఏక్యూ నిబంధనలు ప్రకారం ధాన్యాన్ని సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ ) సర్ట్బిపై చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని పిఏసిఎస్ సీఈఓలకు సూచించారు. గత సీజన్ లో పొరపాట్లు ఈసారి దొర్లకుండా చూడాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం కోరారు. సిఈఓలు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సమావేశం దష్టికి తీసుకొచ్చారు. ప్రతిరైతు ధాన్యాన్ని పరిశీలించి సంబంధిత ఏఈఓ సర్టిఫై చేసి, టోకెన్ ఇచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. మిల్లర్లు, రవాణా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని పౌరసరఫరాల అధికారులు తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సోములు, సహకారశాఖ అధికారులు పాల్గొన్నారు.