Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
వలస ఆదివాసీలను గిరిజనులు కాదనే హక్కు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి లేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండా చరణ్ హితవు పలికారు. మంగళవారం స్థానిక బిఎస్ రామయ్య భవన్లో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వలస ఆదివాసీలను ఓబీసీలుగా మార్చే ప్రయత్నం, వారి వారి ఆవాసాల నుండి వెళ్ళగొట్టే కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఆదివాసీలకు హక్కు లేదనటం రాజ్యాంగం అవమానించినట్లేఅని వారు తెలిపారు. తక్షణమే వలస ఆదివాసీలకు సైతం కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కారం నరేష్, శ్యామల వెంకట్, రామారావు సుబ్బంపేట సర్పంచ్ ఏక సుజాత, పాముల సాంబ, మూర్తి తదితరులు పాల్గొన్నారు.