Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
అడవులను కాపాడుకున్నప్పుడే జీవకోటి మనుగడ సాద్యమని డీఎఫ్ఓ తిరుమలరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నల్లబాడు, తిమ్మాపురం ఆవాసాల్లో ఎఫ్ఆర్సీ సభ్యులు, బృందాలు నిర్వహించే గ్రామ సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ఎఫ్ఆర్సి చైర్మన్ కొర్రాజులు అధ్యక్షత వహించగా ఎఫ్ఆర్ఓ ఎస్.శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, సర్పంచ్ సాధు జ్యోత్స్నా బాయి, సాగు దారులు పోతురాజు, వెంకటరత్నం పాల్గొన్నారు.