Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 5 కేజీల బరువు గల శిశువు జననం
నవతెలంగాణ-భద్రాచలం
సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. ఐతే భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లోని సురక్ష మల్టీస్పెషల్టి హాస్పిటల్లో సోమవారం రాత్రి 5 కేజీల బరువుతో మగ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. పాల్వంచ గ్రామానికి చెందిన కె.శ్రావణి పురిటి నొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది. అక్కడ ఆమెని పరీక్షించిన గైనకాలజిస్ట్ సూరపనేని శ్రీక్రాంతి, అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ అక్కినేని లోకేష్ ఆధ్వర్యంలో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించగా, 5 కేజీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సోమవారం రాత్రి జన్మించిన ఈ శిశువు సాధారన బరువుకంటే కూడా ఎక్కువగా ఉండడం గమనార్హం. మొదటి కాన్పులో శ్రావణి బాబు జన్మించిందనీ, రెండో కాన్పులో కూడా బాబుకు జన్మనిచ్చిందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ శాస్త్ర చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొని జన్మించిన శిశువుకు చికిత్స అందించారు. మహిళ బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.