Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 12వ తేదీన తహసీల్దార్ కార్యాలయం
ముందు నిరసన
అ విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేంతవరకూ ఆందోళన నిర్వహిస్తామని, ఈ నెల 12వ తేదీన నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే ఐటీ దాడులు, నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పోయిందని ఆరోపించారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం సరైంది కాదన్నారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 12వ తేదీన తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగే నిరసన దీక్షలు కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీలు విజయలక్ష్మి, శాంతి, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.